నేటి సాక్షి తొగుట జనవరి 04తొగుట మండలంలోని జెప్తిలింగారెడ్డిపల్లె గ్రామంలో నిరుపేద కుటుంబమైన కమ్మరి అనంతుల లక్ష్మి నాగభూషణం ఇందిరమ్మ నూతన గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేసి మిఠాయిలు పంచారు తదనంతరం ఎల్లారెడ్డిపేట గ్రామ ఉపసర్పంచ్ మహ్మద్ గౌస్ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండలంలోని తుక్కపూర్ గ్రామానికి చెందిన లింగాల స్వామి 25000 రూపాయల కాన్గల్ గ్రామానికి చెందిన బత్తుల యాదయ్యకు 60,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి తాము మాట్లాడుతూ పల్లెలో నిరుపేదల స్వంత ఇంటి కల నిజం చేయడంలో నాడు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దుబ్బాక నియోజకవర్గ అభివృధి సంక్షేమం దూసుకుపోతుంది అన్నారు.మరి ముందు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలలో పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చిన పార్టీ శ్రేణులు కలిసి కట్టుగా పని చేసి ప్రజలలోకి మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలుపు దిశగా పని చేయాలి అన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి,తొగుట మండల మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) ,సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగరీ నర్సింలు,సర్పంచ్లు కనకయ్య, చిక్కుడు మస్టి కళావతి స్వామి,గొడుగు జయమ్మ నర్సింలు, రాంపురం రమేష్, ఉపసర్పంచ్ నూనె శ్యామల, వార్డ్ సభ్యులు బట్టికాడు స్వామి గౌడ్,లావణ్య,బాలరాజు,రామవ్వ,పద్మ, సీనియర్ నాయకులు చిలివేరి రాంరెడ్డి,భూపాల్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,చందా సత్తయ్య, ఆత్ముకూరి రాజు, భూపాల్ రెడ్డి,రవి,కొండల్ రెడ్డి,ఆత్మ కమిటీ డైరెక్టర్ లు బ్రహ్మనందం రెడ్డి,ప్రవీణ్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

