నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)పేద బిడ్డ కు వ్యాల్ల హరీష్ రెడ్డి (బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రామగుండం నియోజకవర్గం) ఆర్ధిక చేయూత. మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు అన్న సమక్షంలో సిద్దిపేటలోని సురభి మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీట్ దక్కించుకొని ఆర్థికంగా సాయం కోసం ఎదురుచూస్తున్న ఒక దళిత బిడ్డ సౌజన్య కు కాలేజీ ఫీ కోసం లక్ష యాభై వేల రూపాయలు (1,50,000/-) ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సందర్భంగా హరీష్ రావు ఎంబిబిఎస్ విద్యార్థిని సౌజన్య కి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్న సిద్దిపేటలోని తన ఆఫీసులో సంప్రదించమని తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది.కార్యక్రమం లో మాజీ కార్పొరేషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు అభిలాష్ రంగినేని పాల్గొనడం జరిగింది.





