తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..*నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అనుకూలమైన ధరలతో తుడా ఫ్లాట్స్ ను విక్రయిస్తుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోరారు. రేణిగుంట మండలం సూరప్పకశం లోని పద్మావతి నగర్ తుడా లేఔట్ ను మంగళవారం తుడా అధికారులతో కలిసి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. లేఅవుట్ ప్లానింగ్ ను అధికారులు తుడా చైర్మన్ కు వివరించారు. కమర్షియల్ కు, రెసిడెన్షియల్ కు కేటాయించిన ప్లాట్స్ ను మ్యాపింగ్ ద్వారా అధికారులు వివరించారు. జంగిల్ క్లియరెన్స్ చేసి వీలైనంత త్వరగా మౌలిక వసతులు కల్పించి వేలానికి వెళ్లాలని తుడా చైర్మన్ అధికారులకు సూచించారు.. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సూరప్పకశం పద్మావతి నగర్ తుడా లేఔట్ లో ఇంకా 270 ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయని తెలియజేశారు. పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనువైన ధరకు ఫ్లాట్లను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడ సెక్రటరీ శ్రీకాంత్, ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ సుజన, సూపర్డెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, చీప్ ప్లానింగ్ ఆఫీసర్ దేవి కుమారి, జాయింట్ ప్లానింగ్ ఆఫీసర్ వాసుదేవరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్రయ్య, డివిజనల్ ఇంజనీర్ నరేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.