నారాయణపేట పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సిద్దు నేటి సాక్షి, నారాయణపేట,జూన్ 19,
పైన కనిపిస్తున్న దృశ్యం నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో . ప్రభుత్వలు హాస్టల్లో బడులను అభివృద్ధి చేశాం బాగున్నాయని అంగు ఆర్భాటాలు ఉన్నాయని స్కూల్ హెడ్మాస్టర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు ఎమ్మెల్యే నుండి ముఖ్యమంత్రి వరకు ప్రభుత్వ హాస్టల్లో గురించి మాట్లాడుతుంటారు. నిజంగా అవి ఆ విధంగా ఉన్నాయా అంటే ఆచరణలో చూస్తే మాత్రం శూన్యం ఏమీ ఉండవు. పేపర్ ప్రకటనలు వీడియోలు వాటిలో నిజం ఉండదు. ఉదాహరణకు పైన కనిపిస్తున్న ధన్వాడ కేంద్రంలోని ఎస్సి బాయ్స్ హాస్టల్. పెచ్చులుడుతునా గోడలు కనీసం బాత్రూంలకు డోర్లు లేకపోవడం దానితో మరుగుదొడ్ల వాసన విద్యార్థులకు రావడంతో అనారోగ్యాలకు గురి కావడం ఇవన్నీ ఒక మండల కేంద్రంలోని హాస్టల్లో ఈ రకమైన పరిస్థితి ఉంటే జిల్లాలే మిగతా హాస్టల్లో ఏ రకంగా పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ అక్కడున్న ప్రిన్సిపాల్ కి గాని ఎంఈఓ గానీ డీఈఓ కు గాని జిల్లా కలెక్టర్కు ఇవన్నీ కంటికి కనబడవా. ఒకవేళ కనిపిస్తున్న కనిపించినట్టుగా నటిస్తున్నారా? విద్యార్థుల భవిష్యత్తు వీరి కంటికి కనిపించడం లేదా? హాస్టల్లో ఉండే పేద విద్యార్థులు అంటే వీరికి చిన్న చూపు? కాబట్టి ఇవన్నీ కనిపించవా అంటే వాస్తవంగా ఇవన్నీ అందరికీ తెలుసు అయినా జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నట్టు ఎవరికి ప్రజాసేవ చేస్తున్నట్టు? కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు . పేద విద్యార్థులు చదివే ధన్వాడ హాస్టల్ లను బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ( పి వై ఎల్) ఉపాధ్యక్షులు సిద్దు**లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

