Saturday, March 21, 2026

*పైడిమడుగులో దొంగల బీభత్సం** తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో బంగారం దొంగతనం కేసు స్థానికులను కలవరపెడుతోంది. గ్రామానికి చెందిన కురుమ మల్లారెడ్డి–గంగవ్వ దంపతుల ఇల్లు లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకు పాల్పడ్డారు. ప్రతిరోజూ మాదిరిగానే వ్యవసాయ పనుల నిమిత్తం తమ తోటకు వెళ్లిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికీ, దొంగలు ఎలాంటి శబ్దం లేకుండా లోపలికి చొరబడి, అల్మారాలో భద్రపరిచిన సుమారు 3 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు.—*ఉదయం ఇంటికి రాగానే దొంగతనం బయటపడింది*బుధవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన మల్లారెడ్డి కుటుంబం ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా ఉండడంతో అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే బంగారం పెట్టెను తెరిచి చూసేసరికి నగలు కనిపించకపోవడంతో దొంగలు బంగారం లూటీ చేసిన విషయం స్పష్టమైంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి తాళం ఎలా తెరిచారు? దొంగలు ముందే రెక్కీ చేసి వెళ్లారా? అన్న కోణాలలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.పట్టణ–గ్రామ ప్రాంతాలలో వరుసగా జరుగుతున్న చిన్నచిన్న చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News