నేటి సాక్షి,నల్లబెల్లి, జనవరి 3 : చలికాలంలో తరచూ పొగ మంచు కారణంగానే ప్రమాదాలు జరుగుతుంటాయి.ప్రస్తుతం వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నందున వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని నల్లబెల్లి ఎస్సై వడిచర్ల గోవర్ధన్ సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. దట్టమైన పొగమంచు వల్ల రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులు కనిపించే అవకాశం తక్కువగా ఉంటుందని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలు:మంచు కురుస్తున్నప్పుడు వాహనాలను అతివేగంతో నడపరాదు.హెడ్‌లైట్లను ‘లో బీమ్’లో ఉంచి, ఫాగ్ లైట్లను తప్పనిసరిగా వాడాలి.చాలా అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే బ్రేకులు, లైట్లు, టైర్ల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవాలి.డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ వాడటం, అజాగ్రత్తగా ఓవర్‌టేక్ చేయడం వంటి పనులు చేయరాదని ఎస్సై గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు.

