Wednesday, January 21, 2026

పొదిలిలో కదం తొక్కిన ఆర్యవైశ్యులు..బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – అన్నా రాంబాబుపొదిలి ఎస్ఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్, అన్నా రాంబాబు డిమాండ్..

నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- ఆర్యవైశ్యు లపై ఈ కూటమి ప్రభుత్వంలో వేధింపులు పెరిగిపోయాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పొదిలిలో అవినాష్ అనే యువకుడుపై ఎస్ఐ రక్తం వచ్చేలా కొట్టాడని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందితే ఆయన తండ్రి కోటేశ్వర రావును కొట్టారని మండిపడ్డారు. పొదిలి ఎస్ఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైశ్యులపై కక్ష్య సాధింపు, పోలీసుల వేధింపులు పెరిగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రక్షణ లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పొదిలి ఎస్ఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఒకవేళ చర్యలు తీసుకోలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు అంతా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తామని పిడుగురాళ్ళలో జ్యోతి అనే మహిళపై పోలీస్ స్టేషన్లో బలవంతంగా సంతకాలు తీసుకుని వేధించారు. వైశ్యులపై పోలీస్ వేధింపులు పెరిగిపోయాయి. వ్యాపారస్తులకు, ఆర్యవైశ్యలకు భద్రత కల్పించండి. తిరుమలలో పరిపాలన గాడి తప్పింది. తిరుమలలో టీడీపీ నేతలు టికెట్లకే పరిమితమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామా అంటే కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. వేధింపులకు గురి చేస్తున్నారు. తప్పు చేస్తే శిక్షించండి. తప్పుడు కేసులు పెడితే మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు 2. 0 చర్యలు తప్పవని మాజీ మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు. ఇక విషయాని కొస్తే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జీసి సుబ్బారావు మండిపడుతూ పొదిలిలో జరిగిన ఆర్యవైశ్యుడిఫై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని లారీ అన్‌లోడ్ విషయంలో ఎరువుల వ్యాపారైనా యాదాల కోటేశ్వరరావు, వారి అబ్బాయి అవినాష్‌ను ఎస్ ఐ దారుణంగా కొట్టడం బాధ కలిగించిన విషయమని ఎస్ఐ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకుంటే కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులంతా దూరం కాబోతారని రెడ్ బుక్ రాజ్యాంగం అండతో పోలీసులు తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని మొదటి నుంచి ఆర్యవైశ్యులు టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళమేనని మాపై కూటమి ప్రభుత్వానికి కనికరమే ఉంటే ఆర్యవైశ్య సోదరుడిపై దాడి చేసిన ఎస్ఐ పై తక్షణమే చర్యలు తీసుకొని అతడిని ఉద్యోగం నుంచి వైదొలగేలా చూడాలని లేనిపక్షంలో మా కార్యాచరణ తీవ్ర రూపం దాలుస్తుందని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. యదాల కోటేశ్వరరావు కుటుంబాన్ని మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి పట్టణానికి చెందిన యదాల కోటేశ్వరరావు మరియు వారి కుమారుడు అవినాష్ ను పొదిలి ఎస్ఐ వేమన విచక్షణా రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరచిన తీరు బాధాకరమని విషయం కోటేశ్వరరావు స్వగృహానికి విచ్చేసి వారిని పరామర్శించానని ఎస్ ఐ పై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆర్యవైశ్యులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతానని అప్పటికి దిగి రాకపోతే ఆర్యవైశ్యులతో కలిసి కార్యాచరణను ఉదృతం చేస్తామని హెచ్చరించారు..~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News