*నేటి సాక్షి, గన్నేరువరం( బుర్ర అంజయ్య గౌడ్):* మండలంలోని చొక్కారావు పల్లె గ్రామంలో పొదుపు లక్ష్మి గ్రామైక్య సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ ఆరుకొంతం గోపాల్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ మామిడి జైపాల్ రెడ్డి ని మహిళా సంఘాల సభ్యులు శాలువతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం సర్పంచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి వివో నూతన భవనానికి సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళల సహకరిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో వివో అధ్యక్షురాలు అన్నాడి శ్రీ వాణి, కార్యదర్శి అన్నాడి అంజవ్వ, కోశాధికారి బూర రేణుక, మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

