నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 3 ఇంట్లో దొంగలించబడ్డ సొత్తు లభ్యం కాగా ఆంజనేయ స్వామి .మహిమ గా భావించి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు .టిటిడి రాజనాల బండ టెంపుల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ .కథనం మేరకు… చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ గాజులవారిపల్లికి .చెందిన గిరిబాబు ఇంట్లో గత నెల 10న 70 గ్రాములు బంగారాన్ని చోరీ చేశారు .ఈ విషయమై చుట్టుపక్కల విచారించిన ఫలితం లేకపోవడంతో రాజనాల బండను ఆశ్రయించారు. అనుమానితులను బండకు పిలిపించి విచారించారు. మరొక వారానికి వాయిదా వేయడంతో వెళ్లారు ఈ క్రమంలో నేడు ప్రమాణం చేయాల్సి ఉంది. కాగా గుర్తు తెలియని వ్యక్తులు 70 గ్రాముల బంగారాన్ని గిరిబాబు ఇంటిముందు వేసి వెళ్ళిపోయారు గుర్తించిన గిరిబాబు కుటుంబ సభ్యులు రాజనాల బండ మహిమతోనే తనకు సొత్తు లభించిందని బండపై గల ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు

