నేటిసాక్షి, రాయికల్ :
వర్షాలు సమృద్దిగా కురిసి, పాడి పంటలు చక్కగా పండి అందరు బాగుండాలని కోరుతూ రాయికల్ పట్టణంలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పొచమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు ఇంటికో బోనం నెత్తిపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో డిజె పాటలతో పోతు రాజుల విన్యాసల మద్య మార్కండేయ దేవాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి పొచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, యువజన సంఘం అధ్యక్షులు సామల సతీష్, ప్రధాన కార్యదర్శి అడేపు రాజీవ్, కోశాధికారి బొమ్మకంటి నవీన్, ఉపాధ్యక్షులు సింగని సతీష్, ఎలిగేటి సతీష్, కార్యదర్శులు అనుమల్ల చంద్రతేజ గంట్యాల ప్రవీణ్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, శ్రీరాముల సత్యనారాయణ, మామిడాల లక్ష్మీనారాయణ, మ్యాకల రమేష్, ఎలిగేటి రాజకిషోర్, అష్టమవాడ పెద్దలు గూడూరి పొట్టయ్య, సామల్ల రాజేశం, సత్యనారాయణ, సిరిపురం రఘు, ఆడేపు నర్సయ్య, సామల్ల గోపాల్, గాజెంగి అశోక్, గోపాల్, సంఘ సభ్యులు మహిళా సంఘం, పోపా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్:13RKL02: బోనాలతో వెళ్లుతున్న పద్మశాలి కులస్థులు