Wednesday, March 18, 2026

పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన : ఎమ్మెల్యే బిఎల్ఆర్-రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించే వారికి రూ.1లక్ష డొనేషన్ ఇస్తా : హామీ ఇచ్చిన బిఎల్ఆర్

నేటిసాక్షి, మిర్యాలగూడ : మండల పరిధిలోని శ్రీనివాస్ నగర్ నందు గల మహాత్మ జ్యోతిబాపూలే బిసి బాలికల గురుకుల పాఠశాల & కళాశాల దామరచర్ల నందు నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి, పాఠశాల వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోటిల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా బలంగా ఉండేందుకు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహిస్తునందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం తెలంగాణలో విద్య కు ప్రాధాన్యతనిస్తూ, విద్యా విధానాన్ని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేస్తుందని అన్నారు. కావున విద్యార్థులు అందరూ ధృడమైన సంకల్పంతో మంచిగా చదువుకొని, మీ కుటుంబాలకు, మన మిర్యాలగూడ కి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. అలాగే మన మిర్యాలగూడ నియోజకవర్గంలో గురుకుల విద్యార్థులు ఎవరైతే రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధిస్తారో వారికి రూ.1లక్ష డొనేషన్ అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ గురుకుల ఆర్సీఓ, మండల విద్యాధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు మరియు బ్రదర్స్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News