Wednesday, February 18, 2026

పోడు భూములు, అసైనడ్ లాండ్స్ సాగు భూముల రైతులు యూరియా తీసుకోవచ్చు-జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్

నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా ఇబ్బందులు తొలగించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ బుకింగ్ ద్వారా పంట సాగు చేసే ప్రతి ఒక్క రైతు యూరియాను మొదటిగా బుక్ చేసుకొని, తమకు కేటాయించిన కేంద్రాల్లో యూరియా తీసుకెళ్ళాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రంలో పలు ఫర్టిలైజర్ షాపులను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులతో కలిసిజిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతు వేదిక దామరచర్లలో రైతులకు సూచనలు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు యూరియా అందుబాటులో ఉంది, పోడు భూములు, అసైనడ్ లాండ్స్ మొదలగు సాగు లో ఉన్న భూములకు కూడా యూరియా తీసుకోవచ్చని, ఆ రైతులు సంబంధిత 13బి, వన్ బి జిరాక్స్ కాపీలను, మరియు ఎటువంటి ఆధార్ లేకుండా సాగు చేసేవాళ్లు కూడా గ్రామ పరిపాలన అధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి, ఆన్లైన్ చేసుకొని, యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా పొందవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు సైదా నాయక్, వ్యవసాయ అధికారి రుషేంద్రమణి, వ్యవసాయ శాఖ అధికారులు పార్వతి, సైదులు, సీఈవో వెంకటరెడ్డి, రైతులు శ్యాంసుందర్, వెంకటేశ్వర్లు, లావూరి జానకిరాములు, రావూరి కిషన్, గొంగడి శ్రీనివాస్ రెడ్డి, లావూరి హరి, జానకి రాములు, మన్యం నాగయ్య, రావూరి సైదా, రావూరి రవి, శంకర్, బిక్షం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News