Tuesday, March 10, 2026

పోతారంలో పౌర హక్కుల దినోత్సవం

అవగాహన కల్పించిన అధికారులు

నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండల పరిధిలోని పోతారం గ్రామంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రజలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌ఐ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, ప్రతి పౌరుడికి చట్టబద్ధమైన హక్కులు ఉన్నట్టే, వారికి సమానంగా బాధ్యతలు కూడా ఉన్నాయి. చట్టపరమైన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, నైతిక విలువలు ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఈ సందర్భంగా పౌర హక్కుల ప్రాముఖ్యత, వాటి పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. అధికారులను గౌరవించడం, చట్టాలను పాటించడం వంటి అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గోపాల్, గ్రామ కార్యదర్శి, గ్రామస్థులు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News