*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామం లో పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వెటర్నరీ డాక్టర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ పోరుమల్లలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వాటి సంరక్షణ వాటి పెంపుదల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడి డాక్టర్ నరేష్, ఏడి శ్రీదేవి,మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్ యాదవ్, సర్పంచ్ గుయ్య అంజన్న, ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి ప్రణయ్ రెడ్డి,వివిధ మండలాల నుంచి వచ్చిన వైద్యాధికారులు వార్డు మెంబర్ సత్యం, మిట్టపల్లి భూమారెడ్డి, మిట్టపల్లి తిరుపతి రెడ్డి, పాల్గొన్నారు.





