Monday, December 23, 2024

పోలీసుల ఆటలు ముగింపు

  • – కరీంనగర్​ పోలీస్​ అనువల్​ స్పోర్ట్స్​ మీట్​ ముగింపు
  • – మల్టీజోన్​ ఐజీ‌‌–1 ఏవీ రంగనాథ్​ హాజరు

నేటి సాక్షి, కరీంనగర్​ క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులకు నిర్వహించిన 2024 వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శుక్రవారం కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్​లో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్టీజోన్ ఐజీ–1 ఏవీ రంగనాథ్​కు పుష్పగుచ్ఛం అందజేసి సీపీ అభిషేక్​ మహంతి స్వాగతం పలికారు. పోలీస్ ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జట్ల వారీగా స్పోర్ట్స్ పరేడ్ నిర్వహించారు. తర్వాత స్పోర్ట్స్ మీట్ లైట్ వెలిగించారు. ఈ సందర్బంగా ఐజీ మాట్లాడుతూ మొన్నటి వరకు ఎన్నికల హడావుడి ఉండి, మరో నాలుగు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ ఉండగా, ఈ మధ్య అతి తక్కువ విరామంలో విధుల్లో నిమగ్నమై ఉన్న పోలీసులకు అతి తక్కువ సమయంలో చాలా గొప్పగా ఈ మీట్ నిర్వహించారన్నారు. ఇందుకు సీపీని అభినందించారు. నిత్యం విధుల్లో ఉండే పోలీసులకు ఇటువంటి ఆటలతో మానసికోల్లాసమే కాకుండా శారీరక ధృడత్వంతో పాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని చెప్పారు. ఈ మీట్​లో భాగంగా సిబ్బందికి అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్​బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, హ్యాండ్​బాల్, కబడ్డీతో పాటు మొత్తం 12 క్రీడల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News