Wednesday, March 18, 2026

**పోలీసుల నిర్లక్ష్యం… సర్కారు వైఫల్యం!కర్రె రాజశేఖర్ కుల దురహంకార హత్యతో రాష్ట్రం మండి పోతోంది** * కుల దురహంకార హత్యలతో రాష్ట్రం కుదిపేసిన ఎల్లంపల్లి! * పోలీసులు వినకపోతే ప్రాణాలే పోతాయి…. ఇది రాష్ట్రంలో దళితుల పరిస్థితి! * ఇంకా కూడా పోలీసులు లైట్ గా తీసుకుంటే…. దళితుల ప్రాణాలు చౌక కాదు..!

నేటి సాక్షి మహబూబాబా ద్ (భూక్యా ravi నాయక్) నవంబర్ 19 నరసింహుల పేట మండల కేంద్రంలో నిరసన రంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లిలో దళిత యువకుడు కర్రె రాజశేఖర్‌పై జరిగిన దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలిస్తోంది. అర్ధరాత్రి కిడ్నాప్ చేసి, క్రూరంగా హత్య చేసి, శవాన్ని దహనం చేసిన ఘటనపై నరసింహులపేటలోని అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. నిరసనలో పాల్గొన్న కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకూబ్ తీవ్రంగా మండిపడి మాట్లాడుతూ — “ఈ హత్య వెనుక ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం, దళితులపై పెరుగుతున్న కుల ఉన్మాదం స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని తెలిపారు.నెల పాటు బాధితురాలైన భార్య ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసుని విచారించకపోవడం, బాధిత కుటుంబానికే బెదిరింపులు రావడం, ప్రేమ వివాహం అంశాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం—అల్ ఇవే రాజశేఖర్ ప్రాణాల్ని బలిగొన్నాయని యాకూబ్ స్పష్టం చేశారు. యువతి తండ్రి వెంకటేష్ స్వయంగా మృతుడి ఇంటికి వెళ్లి బయటకు తీసుకెళ్లినప్పటికీ, అది వరకు కూడా పోలీసులు స్పందించకపోవడం వ్యవస్థ యొక్క అసలు బట్టలు విప్పిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.“తమ్ముడు ప్రేమ పేరుతో అన్నను పోలీసులు వేధించడం, మరోవైపు కులవాదులు ప్రాణాలు తీసేయడం—ఇది దళితులపై జరుగుతున్న పద్ధతిపూర్వక దాడుల భాగం. రాష్ట్రవ్యాప్తంగా కుల దురాహంకార హత్యలు పెరుగుతున్నాయి, ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది. దళితులను రక్షించడంలో పోలీసుల వైఫల్యాన్ని ఇక ప్రజలు సహించరు” అని యాకూబ్ గట్టిగా హెచ్చరించారు.శాసనసభలో ప్రత్యేక చర్చ నిర్వహించి కులాంతర వివాహితుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కాకపోతే రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని ముట్టడించడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు. రాజశేఖర్ కుటుంబానికి 50 లక్షల పరిహారం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, అలాగే కుటుంబానికి ప్రత్యేక పోలీసు రక్షణ ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు.“దళితుల ప్రాణాలు చౌక కాదు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్రంలో భారీ ప్రజా ఉద్యమం తలెత్తుతుంది. దళితులపై కుల హింసకు ఇక మేము లొంగం, పోరాటమే మార్గం” అని యాకూబ్ ఘాటుగా ప్రకటించారు.ఈ నిరసన కార్యక్రమంలో చిర్ర సతీష్, బానోత్ సర్వన్, వెంకన్న, నరేష్ తదితరులు దళితులు గిరిజన సంఘాలు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News