Friday, March 13, 2026

**పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్-ACS రాజు**—–జగిత్యాల టౌన్.

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………….భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ , దేశ భద్రత, సమగ్రత, సమైక్యతకోసం అసువులు బాసినపోలీసు సిబ్బందికి దేశం తరఫున అంకిత భావంతో ఘననివాళులు అర్పిస్తున్నం అన్నారు.పోలీసు స్మారకంపై అమరుల పేర్లు 130కోట్ల దేశవాసుల మనోభావాలకు ప్రతీకలుపోలీసు అమరవీరులు ప్రతి రక్తపు బిందువూ దేశ ప్రగతికి బాటలు వేసిందిఅమరవీరుల త్యాగాల ఫలితంగా మనమంతా ప్రశాంతంగా నిద్రపోతున్నాం.పండుగల్లో కూడా పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారుఅని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS రాజు, జిల్లా ప్రధానకార్యదర్శి అక్కిన పెళ్లి కాశీనాదం, చిట్ల గంగాధర్, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి,జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్, వేముల పోచామల్లు, నారేందుల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, అంజన్న, వేముల దేవరజం, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్ , కొత్తాకొండ బాలన్నా, బాషెట్టి ప్రభాకర్, ఎడమల వెంకట్ రెడ్డి,ఒడ్డపెళ్ళి మురళి, గడసు భుమన్న, కృష్ణ, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News