*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )తెలంగాణ రాష్ట్ర డీజీపీ ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన Arrive Alive కార్యక్రమం 10 రోజులు పాటు నిర్వహించనున్న Arrive Alive రోడ్డు భద్రత కార్యక్రమం అందులో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల డిఎస్పి రఘు చందర్ సూచనలతో ధర్మపురి సీఐ రామ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో ఎస్సై జి సతీష్ ఆధ్వర్యంలో గోపులాపూర్ రోడ్డు భద్రత అవగాహన గురించి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బుగ్గారం ఎస్సై జి సతీష్ మాట్లాడుతూ ప్రజలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతలు పాటించాలని ముఖ్యంగా హెల్మెట్లు మరియు సీట్ బెల్ట్ లు ధరించాలని, తాగి వాహనాలను నడపడం మితిమీరిన వేగం, రాంగ్ రూట్లో డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ వంటి పనులు చేయకూడదని వివరించారు. రోడ్డు భద్రత నియమాలు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని వారితోపాటు వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు భద్రత కల్పించవచ్చని అవగాహన కల్పించడం జరిగినది. అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ తమ వంతు బాధ్యతగా అరైవ్ అలైవ్ లక్ష్యాలను సాధించాలని విజ్ఞప్తి చేయడం జరిగినది. ఇంకా ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ పరమేష్ సాజిత్ గ్రామ ప్రజలు వ్యాపారులు పాల్గొనడం జరిగినది

