నేటి సాక్షి జిన్నారం: (బొల్లారం మున్సిపాలిటీ ) బొల్లారం పారిశ్రామిక వాడలో నివసించే ఉత్తర భారతీయ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి ఏటా కార్తీక మాసంలో చట్ పూజలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సూర్య భగవాన్ ఆలయంలో జరిగిన పూజల్లో ఎస్పీ పరితోష్ పంకజ్, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోలీస్ శాఖ తరఫున ఏర్పాటుచేసిన ప్రత్యేక బందోబస్తును ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానిక యువజన నాయకుడు వి.ప్రవీణ్ రెడ్డి, దిననాథ్, మహిళా సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఎస్పీని, పటాన్చెరువు డిఎస్పి ప్రభాకర్’లను కలిసి ఘనంగా సన్మానించారు. ప్రశాంతమైన వాతావరణంలో పూజలు జరుపుకునేలా సహకరించడం పై ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు లక్కన్, యువజన నాయకులు మధుకర్ రెడ్డి, సాయి, అంబి మహిళా సేవా సమితి సభ్యులు దుర్గవతి దేవి, గీత దేవి, ఆషా, ఆర్తి, పూనమ్, మీరా, చోటి, మున్సిపల్ ప్రజలు పాల్గొన్నారు.





