Saturday, March 14, 2026

*పోలీస్ అమరవీరుల త్యాగాలే స్ఫూర్తిగా ప్రజల సేవలో ప్రతి అడుగు అంకితం చెయ్యాలి** అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బాపట్లలో 5 కిమీ మారథాన్ రన్ ప్రారంభం* ప్రారంభించి, పోటీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్.

నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధిపోలీస్ అమరవీరుల త్యాగాలే స్ఫూర్తిగా ప్రజల సేవలో ప్రతి అడుగు అంకితం చేయాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ జిల్లా పోలీసులకు, యువతకు పిలుపునిచ్చారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం 5 కిమీ మారథాన్ రన్ నిర్వహించడం జరిగింది. దీనిని జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా పాల్గొన్నారు. ఈ మారథాన్ రన్‌లో సుమారు 200 మంది విద్యార్థినులు, విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమైన మారథాన్ రన్ చీలిరోడ్డు, పాత బస్టాండ్ మీదుగా గడియార స్థంభం సెంటర్ వరకు వెళ్లి తిరిగి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని యువతలో నింపడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీస్ సిబ్బంది త్యాగాలు ఎప్పటికీ మరువరాని మహోన్నతమైనవని అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శనివారం ఐదు కిలోమీటర్ల మారథాన్ రన్ నిర్వహించామని, దీనిని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో పోలీసులతో పాటు విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. మొత్తం సుమారు 200 మందికి పైగా పాల్గొన్న ఈ మారథాన్‌లో విజేతలుగా నిలిచిన వారికి అక్టోబర్ 31వ తేదీన బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. త్వరలో వ్యాకృత, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నామని చెప్పారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ సేవా భావం, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు కిలోమీటర్ల మారథాన్ పరుగులో ఓవరాల్ విజేతలుగా బాపట్ల అగ్రికల్చర్ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న డి. మనోహర్, పిజిఆర్ఎస్ సెల్‌లో విధులు నిర్వహించే సివిల్ కానిస్టేబుల్ పి. నాగ బ్రహ్మారెడ్డి, అగ్రికల్చర్ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న బసల్ బోబాన్ లు వరుస మూడుస్థానాల్లో నిలిచారు. పోలీసుల కేటగిరీలో జి. పి. నాగ బ్రహ్మారెడ్డి, ఏఆర్ విభాగంలో విధులు నిర్వహించే జి. కృష్ణ, చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే సిహెచ్. దుర్గాప్రసాద్, విద్యార్థుల కేటగిరీలో అగ్రికల్చర్ కళాశాలకు చెందిన డి. మహేంద్ర, బసల్ బోబాన్, పి. వినయ్ కుమార్ లు, మహిళా విద్యార్థినులలో బాపట్ల అగ్రికల్చర్ కళాశాలకు చెందిన డి. దీపిక, జి. భార్గవి, షేక్. ఫిరోజా కౌశర్బీ లు వరుసగా మొదటి మూడు స్థానాలలో నిలిచారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి. విజయసారధి, బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు, ఎస్బీ ఇన్స్పెక్టర్ జి. నారాయణ, బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్. రాంబాబు, ఆర్‌ఐలు షేక్. మౌలుద్దీన్, టి. శ్రీకాంత్ లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News