Sunday, March 15, 2026

పోలీస్‌ అమరవీరుల స్ఫూర్తితో సైకిల్‌ ర్యాలీ ఆరోగ్యానికి, సేవకు చిహ్నంగా ముందడుగు పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌…

నేటి సాక్షి నారాయణపేట,అక్టోబర్ 30,పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.జిల్లా పోలీస్‌ పరేడ్ మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగి, చివరగా ఎస్పీ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు, యువత, విద్యార్థులు, చిన్నారులు, పోలీసులు, ప్రజలతో కలిసి సైక్లింగ్‌ చేస్తూ, “జోహార్ పోలీస్‌ అమరవీరులకు జోహార్ జోహార్” అంటూ నినాదాలు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… ప్రతి రోజు సైక్లింగ్‌ చేయడం వల్ల శరీర దృఢత్వం పెరగడమే కాకుండా మనసుకు ఉత్తేజం లభిస్తుంది అని ఆరోగ్యంగా ఉంటే విధుల్లో మరింత సమర్థతతో రాణించవచ్చు అని తెలిపారు. పోలీస్‌ అమరవీరులను స్మరించుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఈ సైకిల్‌ ర్యాలీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినివ్వాలి అని ఎస్పీ గారు పేర్కొన్నారు.అమరవీరుల సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు, విద్యార్థులకు, పోలీస్‌ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ర్యాలీలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐ శివశంకర్, ఆర్ఐ నరసింహ, ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేష్, శివశంకర్, శ్వేత, శిరీష, కృష్ణ చైతన్య, రమణ, యోగ సభ్యులు, విద్యార్థులు, మరియు ఇతర పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News