జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ జగిత్యాల టౌన్ (నేటి సాక్షి)(పూరెళ్ల బాపు)….(అక్టోబర్ 13):పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం “పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్బంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీ (Essay Writing Competition) నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చుఅని అన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని , ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది అంతే కాకుండా జిల్లా స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని ఎస్పి గారు సూచించారు.*వ్యాసరచన అంశం (Essay Topic):**“Drugs Menace: Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs”**(డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు)**పోటీలో పాల్గొనే విధానం*1. కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి:👉 https://forms.gle/jaWLdt2yhNrMpe3eA2. మీ పేరు, విద్యార్హత మరియు ఇతర వివరాలు నమోదు చేయండి.3. వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని చిత్రం (image) లేదా PDF ఫార్మాట్లో (500 పదాలు మించకూడదు) అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.





