Tuesday, February 24, 2026

పోస్టర్ ఆవిష్కరించిన మినా కళాశాల చైర్మన్ మహమూద్ అలీ

నేటిసాక్షి, మిర్యాలగూడ : మార్చి 03 తేదీన పట్టణంలోని కళాభారతిలో “బుద్ధునితో నా ప్రయాణం నాటకం” డాక్టర్ మువ్వా రామారావు, డాక్టర్ జాడి రాజు ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుందని, ఈ సందర్భంగా నిర్వాహకులు సోమవారం మినా కళాశాల చైర్మన్ మహమ్మద్ అలీ పోస్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ తన చివరి దశలో బుద్ధుని సిద్ధాంతాలకు ఆకర్షితుడై, బౌద్ధిజాన్ని స్వీకరించడం జరిగిందని, బుద్ధునితో తనకున్న అనుభవాన్ని వివరించడమే ఈ నాటక ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ప్రభాకర్ తాళ్లపల్లి రవి కందుకూరి సుదర్శన్, కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News