నేటిసాక్షి, కరీంనగర్: ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే చక్కని ఆరోగ్యంతో ఉంటారని కాంగ్రెస్ నాయకుడు, వీఎన్నార్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ వీ. నరేందర్‌రెడ్డి అన్నారు. 45వ డివిజన్‌లో అజీమ్ ఆధ్వర్యంలో సన్‌రైజ్, శరత్ మాక్స్‌విజన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, బత్తిని విష్ణుగౌడ్, అరవింద్ తొర్తి, తుమ్మల రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

