Thursday, March 19, 2026

*ప్రకృతి వ్యవసాయంపై మహిళలకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమం*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ నిధులతో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, మహిళా అధ్యయన విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంపై రామచంద్రాపురం మండలంలోని కుప్పంబాదూరు గ్రామం లో మంగళవారం నుంచి గురువారం వరకు 3 రోజులుగా మహిళలకు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించి, మహిళలు వ్యాపారవేత్తలుగా మారేలా ప్రోత్సహించి, తద్వారా ఆర్థిక సాధికారత సాధించేలా చేయడమే ఈ కార్యక్రమ యొక్క ముఖ్య ఉద్దేశమనిఈకార్యక్రమ నిర్వాహకురాలు మరియు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్,డా.నీరజ అన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో ,మహిళలకు, ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత, సాగు పద్ధతులు వివరించి, జీవామృతం, బీజామ్మృతం, పంచగవ్య తో పాటుగా, వివిధ రకాల కషాయాల తయారీ విధానాలను ప్రత్యక్షంగా చేసి చూపించడం జరిగింది. అనంతరం, తీగ, దుంప మరియు ఆకు కూరల విత్తనాలను పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోడల్ మండల టీం లీడర్ విమల, క్లస్టర్ మెంటార్ మిథున్ రెడ్డి, మార్కెటింగ్ మాస్టర్ ట్రైనర్ రాగమ్మ, నాచురల్ ఫార్మింగ్ హెల్త్ న్యూట్రిషన్ మేఘన, యూనిట్ ఇంచార్జి లాలెమ్మ, ఐ సి ఆర్ పి సుబ్రహ్మణ్యం రెడ్డి, రామయ్య, మోడల్ మేకర్ మోహన్ రెడ్డి, తదితరులు రిసోర్స్ పర్సన్లు గా విచేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 30 మంది మహిళలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News