Saturday, March 21, 2026

*ప్రకృతి వ్యవసాయం తోనే మానవాళికి మనుగడ**:టిడిపి అధ్యక్షులు తిరుమలరెడ్డి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన మేఘాలయ టీం, అగ్రికల్చర్ స్టూడెంట్స్రామచంద్రపురంరామచంద్రపురం మండలం కొత్త కండ్రిగ పంచాయతీ టీవీ సపార్లు గ్రామంలో బి రాగమ్మ మహిళ రైతుకు సంబంధించిన బయో ఇన్పుట్స్ తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకల తిరుమలరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంమానవాళి మనుగడకు సురక్షితమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయ సహకారాలతో ప్రకృతి వ్యవసాయ విస్తరణలో భాగంగా మన మండలంలో ప్రతి పంచాయతీలోనూ ఒక బయో ఇన్పుట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ప్రతి ఒక్క రైతు రసాయనక ఎరువులకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయంగా పశువుల, ప్రకృతి వనరులతో సహజ సిద్ధంగాతయారు చేసే ఇన్పుట్స్ వినియోగించాలని సూచించారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ మోడల్ మండల టీం లీడర్ విమల మాట్లాడుతూ దేశం మొత్తం ప్రకృతి వ్యవసాయ విధానాల కోసం మన రాష్ట్రం వైపు చూస్తున్నారని అందులో భాగంగా మేఘాలయ రాష్ట్రం నుంచి కొంతమంది ప్రతినిధులు రామచంద్రపురం మండలంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను వారం రోజులుగా సందర్శిస్తున్నారన్నారు. అలాగే అగ్రికల్చర్ స్టూడెంట్స్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తూ కషాయాల తయారీ విధివిధానాల గురించి ప్రత్యక్షంగా చేసి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్సి సెంటర్ యజమాని బి . రాగమ్మ మాట్లాడుతూ తిరుపతి జిల్లా డిపిఎం ఏ . షణ్ముగం ఆదేశాలతో ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవ ఉత్ప్రే రకాలు ఘనజీవామృతం, ద్రవ జీవమృతం, పంటలో తెగుళ్ళకు నివారణకు వాడే కషాయాలు దశపర్ని, బ్రహ్మాస్త్రం, వావిళ్ళకు, వేప గింజల ద్రావణం. పంట ఎదుగుదలకు, దిగుబడి కి వినియోగించే పంచగవ్య, పుల్లటి మజ్జిగ, చేప బెల్లం ద్రావణం ప్రతి ఒక్కటి ఈ కేంద్రంలో లభించునని తెలిపారు. దేశీయ విత్తనాలు, పిఎండిఎస్ కిడ్స్, వ్యవసాయ పరికరాలు అందుబాటులో తెచ్చామన్నారు. భావితరాల మనుగడ కొరకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తేనే భూమి ఆరోగ్యం, మన అందరి ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు., ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీం దాదాబీర్ గ్రామస్తులు శేఖర్ నాయుడు, విఏఓ, హెల్త్ న్యూట్రిషన్ సిబ్బంది,,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, రైతులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News