నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)* *తిరుపతి రూరల్* తిరుపతిలోని డిఆర్డిఏ మీటింగ్ హాల్లో ప్రకృతి వ్యవసాయం పైన రైతు మాస్టర్ ట్రైనర్స్ కు రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని మరియు మోడల్స్ ను ఎక్కువ మంది రైతులతో ఎక్కువ గ్రామాలలో విస్తరింప చేయడం కోసం రైతు మాస్టర్ ట్రైనర్స్ ఎంపిక చేసిన వారికి ఆరు నుంచి పదిమంది ఐ సి ఆర్ పి లు ను మ్యాప్ చేసి క్యాడర్ యొక్క సొంత పొలాల్లో మోడల్స్ వేస్తూ మ్యాప్ చేసినటువంటి ఐ సి ఆర్ పి లు కు ట్రైనింగ్ ఇస్తూ వారి Iపొలాల్లో కూడా మోడల్స్ వేయించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఐన అందరూ కూడా లీడ్ ఫార్మర్స్ ను ఎంపిక చేసుకొని వారితో కూడా మోడల్స్ వేయించడం వల్ల ఎక్కువ మోడల్స్ రైతులు వెయ్యడం జరుగుతుంది. ఈ మోడల్స్ వల్ల తక్కువ పెట్టుబడితో రైతుకు నిరంతరా ఆదాయం రావడం ప్రకృతి వ్యవసాయ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని డిపిఎం ఏ. షణ్ముగం వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి శోభన్ బాబు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని సెర్ప్ ద్వారా లోన్ రూపంలో అందిస్తున్నామని తెలియజేశారు. మహిళలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మునగా సాగు చేసినట్లయితే హార్టికల్చర్ తరఫున సబ్సిడీ అమౌంట్ ఇస్తూ మార్కెటింగ్ కు మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతుకు ఎక్కువ ఆదాయం వస్తుందని వివరించారు. ప్రతి మహిళా కూడా వారి ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్స్ వేసుకోవడం వల్ల ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండినటువంటి ఆహార ఉత్పత్తులు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. చిరుధాన్యాలు మరియు చిరుధాన్య ఉత్పత్తులను ప్రాసెస్ చేసి స్నాక్స్ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసుకునేటువంటి అగ్రికేటర్స్ కాల్స్ పెట్టుకునే అవకాశం కల్పించడం, ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకునే వారికి కూడా 30% సబ్సిడీ అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం ఎ.షణ్ముగం, డ్రామా పిడి శోభన్ బాబు , ఆడిషన్ డిపిఎం పట్టాభి రెడ్డి , డీ ఏ రవి చంద్ర ప్రసాద్ , ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరైయ్యారు





