-మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ, నేటిసాక్షి : ప్రత్యేక నటుడు కోట శ్రీనివాసరావు మృతి నన్ను దిగ్బ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం మృతిచెందగా ఆయన నివాసానికి వెళ్లి, పార్దివ దేహంపై పూలమాలలు వేసి, ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 750 పైగా చిత్రాల్లో నటించి, ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన గొప్ప నటుడు అని, పద్మశ్రీ, నంది అవార్డులు అందుకున్నరని వారి సేవలను కొనియాడారు. కోట శ్రీనివాసరావు మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటని అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.