నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ పట్టణంలోని ప్రగతి హై స్కూల్ లో ఘణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడలను ప్రిన్సిపాల్ బాలె శేఖర్ పాల్గొని జెండాను ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు కేవలం పతకాలు గెలవడం లేదా బహుమతులు పొందడానికే పరిమితం కావని. అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహనం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.విద్యార్థులు గెలిచినా, ఓడినా నిజమైన విజయం వారి ప్రయత్నం, నిబద్ధత, స్పోర్ట్స్‌మాన్ స్పిరిట్‌లోనే ఉందని స్పష్టం చేశారు. ఈ రోజు మీరు నేర్చుకునే పాఠాలే రేపు మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాయని పేర్కొన్నారు. తమ శక్తిపై నమ్మకం, లక్ష్యంపై దృష్టి ఉంటే ఏ సవాలునైనా అధిగమించవచ్చని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు.చివరగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ ప్రతిభను మరియు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బాలె జయశ్రీ శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

