Thursday, January 22, 2026

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా సేవలు అందించాలి పేట

జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్….గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి…. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి…. మక్తల్ పోలీస్ స్టేషన్ ను అస్మికంగా తనిఖీ చేసిన: జిల్లా ఎస్పీ. నేటి సాక్షి,నారాయణపేట , జూన్ 24,మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్* మక్తల్ పోలీస్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు, ఎక్కువ ఏలాంటి కేసులు వస్తున్నాయని, రిసెప్షన్ స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వహించవద్దని, కేసు నమోదు అయినా వెంటనే రిసిప్ట్, ఎఫ్ ఐ ఆర్ కాపీ తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ప్రజలు తీసుకువచ్చే ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా బాధితుల పిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని సూచించారు. బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా, నాదొక ద్రవ్యాలు, ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. 167 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ… పోలీస్టేషన్ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని మరియు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరూ కృషి చేయాలని, సిబ్బంది ఏ డ్యూటీ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సిబంది అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. ఫంక్షనల్ వర్టికల్స్, జనరల్‌ డైరీ రికార్డులు. రిసెప్షన్, పిటిషన్ విచారణలకు సంబంధించి పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా, PDS రైస్, మత్తు పదార్థాల అక్రమ రవాణా ను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ రామ్ లాల్,ఎస్ఐ లు భాగ్యలక్ష్మి రెడ్డి, ఆచారి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News