Tuesday, December 24, 2024

ప్రజలకు ఇబ్బంది కలుగనివ్వం

నేటి సాక్షి, రాజేందర్​నగర్​: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఉన్న భవానీకాలనీ నుంచి మాపెల్‌ టౌన్‌కు వెళ్లే ప్రధాన డ్రెయిన్‌పైప్‌లో లీకేజీ ఉంది. ఈ లీక్​తో భవానీ కాలనీలోకి కలుషిత నీరు వెనుకకు ప్రవహించడమే కాకుండా ప్రజారోగ్యానికి, మన మౌలిక సదుపాయాల సమగ్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. నిర్వాసితులు ఏప్రిల్ 7న మున్సిపల్ అధికారులు, శానిటరీ విభాగానికి సమస్యను నివేదించగా, మీడియా చానళ్ల ద్వారా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, సమస్య పరిష్కారం కాలేదు. శనివారం బండ్లగూడ జాగీర్ భవానీకాలనీలోని అసోసియేషన్, కాలనీవాసులు బీజేఎంసీ మేయర్ లతాప్రేమ్​గౌడ్, స్థానిక కారొరేటర్ భూపాల్​గౌడ్కు డ్రైనేజీ లీకేజీ సమస్యను వివరించారు. తక్షణమే వారు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. డీఈ, ఏఈని కలిసి సమస్యపై చర్చించారు. లీకేజీని త్వరలోనే బాగు చేస్తామని, ప్రజలకు ఇబ్బంది కలగనివ్వమని హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News