పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా పోలీస్
తేది:13.07.2025
ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాలరాజు
నేటి సాక్షి నారాయణపేట, జులై 13,
నారాయణపేట జిల్లా ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాలరాజు తెలిపారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద ప్రజలకు రోడ్డు భద్రత నియమాల పై, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగల పట్ల జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాలరాజు మాట్లాడుతూ… ప్రజలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివిధ గ్రామాల నుండి సంతకు వచ్చే సమయంలో ఇంట్లో ఒకరు తప్పకుండా ఉండేలా చూసుకోవాలని లేని యెడల బంగారు విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలని సూచించారు. షాపింగ్కు , బ్యాంక్ కు వచ్చే సమయంలో అప్రమత్తంగా ఉంటూ తమ విలువైన వస్తువులను డబ్బులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు అనేక రూపాలలో ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యంగా బ్యాంక్ ఖాతాల వివరాలు ఓటీపీలు, ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత సమాచారం పొంది ఖాతాలో డబ్బులు కాజేస్తున్నారు సోషల్ మీడియా ఫోన్ కాల్స్, ఫేక్ లింక్స్ ద్వారా మోసాల పాల్పడుతున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ , ఇమానియల్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.