నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా -:- ప్రభుత్వమంటే యంత్రాంగం. ఆ ప్రభుత్వాన్ని నడిపించేది రాజకీయ పార్టీలు. అలా అవకాశం ఇచ్చేది ప్రజలు. అందుకే ప్రజలు ఆశించిన పాలన చేయాలి. అది ప్రభుత్వం కర్తవ్యం కూడా. దానినే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నారు. 18 నెలల పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. మనం బాగానే పాలన సాగిస్తున్నామని భావిస్తున్నాం. కానీ ప్రజల నుంచి అది వస్తేనే సత్ఫలితమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తద్వారా యంత్రాంగం పాలనలో వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. వాటిని సరి చేసుకోవాలని చెప్పకనే చెప్పుకొచ్చారు. అయితే వైఫల్యాలు, ప్రజాభిప్రాయం విషయంలో తన గురించి కూడా తాను చెప్పుకొచ్చారు. తాను సైతం మెరుగైన పాలన అందిస్తున్నానని భావిస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆ స్థాయిలో సంతృప్తి లేదని చంద్రబాబు చెప్పేశారు. దాన్ని వైసీపీ వాళ్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. సంతృప్తి స్థాయిని అందుకోవాలని..————————————-ప్రభుత్వంతో పాటు యంత్రాంగంలో వైఫల్యాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ప్రజల సంతృప్తి స్థాయిని అందుకోవాలనేది చంద్రబాబు పునరాలోచన. ఆయన ఏ సమావేశంలో అయినా ఇదే చెబుతూ వస్తున్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని అందుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. పాలనలో బ్యూరోక్రసీ వ్యవస్థ కీలకమని ఆ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాలనా తీరును, వైఫల్యాలపై సమీక్ష జరపడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలన్నది చంద్రబాబు ఆలోచన. ~~~~~~~~~~~~~~~~~~





