నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల పట్టణంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం నవంబర్ 9, 2024న చంటి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ప్రారంభించగా, ఇప్పుడు విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకను ఆత్మీయంగా జరిపారు.*ప్రతీ పౌరునికి అవగాహనే లక్ష్యంగా..*ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు వోడ్నాల రామారావు మాట్లాడుతూ..’ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య ప్రజానీకానికి సమాచారం అందుబాటులోకి రావడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ఈ దిశగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వారా ప్రతి పౌరునికి అవగాహన కల్పించడమే మా లక్ష్యం’ అని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చిప్ప నిరంజన్, గట్ల ప్రకాష్, జిల్లా కన్వీనర్ బద్రి సృజన్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లికొండ సంతోష్ కుమార్, కస్తూరి వెంకటరమణ, ఉపాధ్యక్షులు గుట్ట రమేష్, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు అబ్బూరి రాజనర్సయ్య, కోరుట్ల ప్రధాన కార్యదర్శి బాలే అజయ్, కోరుట్ల అధికార ప్రతినిధి కైలాస సాయి కృష్ణ, జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షులు కంది చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జహంగీర్, ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు బుర్ర నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.______





