ఒక్క నెంబర్ తో 200 కి పైగా సేవలు
- వాట్సప్ లో స్కాన్ చేయండి సమస్యలను పరిష్కరించుకోండి
- ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు
నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రజల సమస్యపై ప్రజల కొరకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు సేవ అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఒక కార్యక్రమానికి ఈ కార్యక్రమం పేరు ప్రజల చేతిలో ప్రభుత్వం కార్యక్రమం . ఇందులో భాగంగా కర్లపాలెం మండలం చింతాయపాలెం లో ప్రజల చేతిలో ప్రభుత్వం కార్యక్రమంను ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ప్రభుత్వ వాట్స్ ఆఫ్ గ్రూపుల పై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క నెంబర్ తో 200 కి పైగా సేవలు అందుబాటులో తీసుకొచ్చింది.వాట్సప్ లో 95523 00009 చాట్ చేయండి లేదా యువర్ కోడ్ స్కాన్ చేయండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీఠా శ్రీనివాసరావు, కార్యదర్శి రాయుడు ,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

