*నేటి సాక్షి , జనవరి 23 కోటపల్లి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన పని తీరుతో ప్రజల ప్రశంసలు అందుకున్న ఎస్ఎచ్ కోటపల్లి మండల చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించారు. విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజలతో స్నేహపూర్వక వైఖరి, న్యాయపరమైన చర్యలతో కోటపల్లి మండలంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొంటూ, పోలీస్ ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంచిన అధికారిగా గుర్తింపు పొందారు.భీమారం ఎస్ఎచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన రాజేందర్ మీ సేవలు కోటపల్లి మండల ప్రజలకు చిరస్మరణీయం. అనేక మంది పోలీస్ అధికారులకు స్ఫూర్తిగా, యువతకు ఆదర్శంగా నిలిచారు. నిజాయితీ గల, సిన్సియర్ పోలీస్ అధికారిగా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పదవిరీత్యా భీమారంకు బదిలీ కావడం సహజమైనప్పటికీ, మీలాంటి అధికారి కోటపల్లి మండలాన్ని విడిచి వెళ్లడం ప్రజలకు ఎంతో బాధ కలిగిస్తోంది. మీరు ఇక మా మధ్య లేకపోవడాన్ని మండల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నతపదవులు చేపట్టి, త్వరలో పదోన్నతి పొంది ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతలుగడించాలని కోటపల్లి మండల ప్రజలు కోరుకుంటున్నారు





