Tuesday, March 17, 2026

*ప్రజల సమస్యలు పరిష్కరించండి.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే గిత్త జయసూర్య కి వినతి పత్రం అందించిన సిపిఐ*.. రమేష్ బాబు జూపాడుబంగ్లా నవంబర్ 12

నేటి సాక్షి జూపాడు బంగ్లా మండలంలో ప్రజా సమస్యలు ఎక్కడివక్కడ తిష్ట వేశాయని పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామాల్లో పర్యటించడం లేదని మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కరించాలని బుధవారం జూపాడు బంగ్లా మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఎమ్మెల్యే గిత్త జయసూర్య కు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు,మండల నాయకులు మాగబుల్ బాషా, రాజు, రమణ, నాగన్న లు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారుమాంచల గ్రామంలో దళితుల కాలనీ కి స్మశాన వాటిక కు స్థలం కేటాయించాలని, మండలం లో సిసి రోడ్లు లేక బురద మాయం తో దుర్వసన తో ప్రజలు జీవిస్తున్నారని, చాబోల్, బన్నూర్ గ్రామ గిరిజనులకు జూపాడు బంగ్లా గ్రామం లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం లో నిర్లక్ష్యం జరుగుతుందన్నారు,భాస్కరపురం నుండి మండ్లిమ్ వరకు NHAI వారు రోడ్డు ధ్వంసం చేసారని వారు అన్నారు. సిద్దేశ్వరం, మిట్టకండలా రోడ్డు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్ ఎస్సి ఫారం అధికారులు సమయపాలన పాటించడం లేదని, సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో పర్యటించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారి పై చర్యలు తీసుకోవాలని వారన్నారు.. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News