నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………….. జగిత్యాల ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్,ఆర్డిఓ లతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా,సమగ్ర విచారణ చేసి పరిష్కరించాలని సూచించారు.ఈరోజు మొత్తం 31 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

