Wednesday, February 11, 2026

*ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం** ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్-దీప్తి దంపతులు * కోరుట్ల – మెట్‌పల్లి, ప్రజలకు ఓటింగ్‌కు పిలుపు——-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ తన సతీమతి దీప్తితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.*ప్రతి ఒక్కరూ తప్పక ఓటేయాలి.!*ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగలాంటివని పేర్కొన్న ఆయన, ప్రతి ఓటు ఎంతో విలువైనదని అన్నారు. ప్రజల తీర్పే అభివృద్ధికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు.మెట్‌పల్లి మరియు కోరుట్ల పట్టణాల ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువత, మహిళలు, వృద్ధులు అందరూ ముందుకు వచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు హక్కు వినియోగం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలోనే కోరుట్ల నియోజకవర్గం ప్రత్యేకమైనదన్నారు.తన నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలైన కోరుట్ల – మెట్ పల్లి కార్యాలయాలపై బిఆర్ఎస్ జెండాలను ఎగురవేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆశాభావం వ్యక్తంచేశారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News