Friday, March 20, 2026

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలేప్పుడు జరిగినా విజయకేతనం ఎగురవేసేది..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే.. మద్దిరాళ్ల మల్లికార్జున

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 11 ~అన్నమయ్య జిల్లా :-: ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలేప్పుడు జరిగినా విజయకేతనం ఎగురవేసేదివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానేనని మద్దిరాళ్ల మల్లికార్జున అన్నారు. ప్రలోభ రాజకీయాలకి కాలం చెల్లిందని కూటమి ప్రభుత్వం కుయుక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టిందని పీలేరు నియోజకవర్గ సమాచార హక్కు చట్టం అధ్యక్షులు మద్దిరాళ్ళ మల్లికార్జున అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగిరేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానేనని పేర్కొన్నారు. అధికార పార్టీ వాళ్లు అధికార బలంతో భయభ్రాంతులకు గురిచేయాలని, ప్రలోభాలకు లొంగతీసుకోవాలని కుట్రలు, కుయుక్తులు పన్నినా, ప్రలోభ పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా, ధైర్యంగా ఎన్నికలలో పాల్గొని నిజాయితీగా ఓట్లువేశారన్నారు. కడప జిల్లాలో జరిగిన ఒక మేయర్, రెండు ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే ఏకగ్రీవం గా ఎన్నిక కావడం అందుకు నిదర్శనమన్నారు .రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, కాకి లెక్కలతో, కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీలతో స్థానిక సమస్థాగత ఎన్నికలను కైవసం చేసుకుంటుందని మల్లికార్జున జోష్యం చెప్పారు..~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News