నేటి సాక్షి గజ్వేల్…..గజ్వేల్, సోమవారం: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా నక్క సంతోషి రాములు గౌడ్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె మాట్లాడుతూ తన గెలుపుకు అహర్నిశలు కృషి చేసిన 15వ వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి తదితర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.వార్డు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పారదర్శక పాలన అందిస్తూ 15వ వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.

