నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 27 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా, 15 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కమిషనర్ ను కోరారు. లక్ష్మీపురం కూడలిని ప్రారంభించాలని, చెత్త వేయకుండా గేట్ ఏర్పాటు చేయాలని, సచివాలయం రోడ్డు అక్రమణలు తొలగించాలని కార్పొరేటర్ ఎస్.కె.బాబు ఫోబ్ ద్వారా కోరారు. కాగా రవీంద్ర నగర్ రెండవ క్రాసులో పెండింగ్ లో ఉన్న రోడ్డు పూర్తి చేయాలని, సుబ్బారెడ్డి నగర్ నందు కాలువలు సరిగా లేక మురుగునీరు ఇండ్లలోకి వస్తున్నాయని, హోసింగ్ బోర్డు కాలనిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, సంజీవనగర్ లోని పెద్ద కాలువ వద్ద గ్రిల్స్ లేక ప్రమాధకరంగా ఉందని, స్కావేంజర్స్ కాలనీ వద్ద ఉన్న చికెన్ షాప్ వ్యర్థాలు కాలువలో వేయడం వలన ఇబ్బందిగా ఉందని, టిడిఆర్ బాండ్లు ఇప్పించాలని, తుడా అపార్ట్మెంట్ వద్ద అనదికారికంగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు అపాలని, సంజయ్ గాంధీ కాలనిలో అనదికారికంగా నాలుగు అంతస్థుల భవనం నిర్మిస్తున్నారు చర్యలు తీసుకోవాలని, ప్రకాశం మునిసిపల్ పార్క్ పరిసరాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, సప్తగిరి నగర్ శివశక్తి కళ్యాణ మండపం వద్ద, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ లో భూగర్భ డ్రైనేజి మరమ్మతులు చేయాలని, రవీంద్ర నగర్ లో తెలుగుగంగ లైన్ వేశారు కనెక్షన్ ఇవ్వలేదని, సుందరయ్య నగర్ లో గుంతలు పూడ్చి రోడ్లు వేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.

