నేటి సాక్షి కోటపల్లి, చెన్నూర్ మండలాల్లో సిపిఎం తరపున గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి పలువురు అభ్యర్థులు గెలుపొందిన ఉప సర్పంచ్ లకు,వార్డు సభ్యులకు చెన్నూర్ పట్టణ కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం చేయడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ సిపిఎం నాయకులను వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్ గా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గెలిచిన సిపిఎం ప్రజా ప్రతినిధులు ప్రజలకు మరిన్ని సేవలు చేస్తూ,ప్రజా,గ్రామ సమస్యలు పరిష్కరించాలని,అవినీతి,అక్రమాలు జరగకుండ చూస్తూ గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ల్లో నిధులు లేక గెలిచిన ప్రజ ప్రతినిధుల ఏమి చెయ్యలేని పరిస్తితిలో ఉన్నారు ఎన్ని ఆశలతో పోటీ చేసి,గ్రామాల అభివృద్ది కోసం కృషి చెయ్యాలనే వారికి నిధులు లేకపోవడంతో గ్రామాల్లో ఎం పని చెయ్యలేక పోతున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు తక్షణమే నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరడం జరిగింది, ప్రజ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే సిపిఎం నాయకులను రాబోయే మున్సిపల్,ఎంపీటీసీ,జెడ్పిటిసి,ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కావిరి రవీందర్, తలండి ముత్తయ్య,వార్డు సభ్యులు కావిరి సునీత, సిడం సమ్మక్క,తలండి మహేష్,తలండి బానక్క, గావిడ భూదేవి, కొండపర్తి సాయికృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, బోడంకి చందు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,సిపిఎం నాయకులు దాసరి రాజేశ్వరి,ముడిమడుగుల బ్రహ్మయ్య,బొగే నాగజ్యోతి, బోండ్ల సరిత, బండారి రాజేశ్వరి,తుమ్మ రేణుక,పుట్ట కృష్ణమాచారి, బోగే సత్యం,మడె లక్ష్మి, ఆదివాసి గిరిజన సంఘం నాయకులు తలండి మల్లేష్, సరేష్ తదితరులు పాల్గొన్నారు.

