నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 38 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 11 మంది తమ సమస్యలు తెలుపగా, 27 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఎన్.జీ.ఓ. కాలని వద్ద భవనం నిర్మిస్తున్నారని గ్రీన్ మ్యాట్ వేయకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి పరిష్కరించాలని, యు.డి.ఎస్. ఓవర్ ఫ్లో అరికట్టాలని, డి.ఆర్.మహల్ వద్ద త్రాగునీరు, మురుగు నీరు కలుషితం అవుతున్నాయి పరిష్కరించాలని, తన అనుమతి లేకుండా నా పన్ను లో పేరును తన కొడుకు మార్చుకున్నాడు పరిష్కరించాలని, ఇంటి పన్ను మార్చాలని, దోభీ ఘాట్ నందు మౌలిక వసతులు కల్పించాలని, దోమలు అరికట్టాలని, సాయి విష్ణు లేఔట్ నందు ఆక్రమణలు తొలగించాలని, గంగమ్మ గుడి తూర్పు ముఖమున రావి చెట్టు తొలగించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డి.ఈ.లు, ఏసిపి లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.