Tuesday, March 10, 2026

ప్రజా సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్

నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సినియర్ అసిస్టెంట్ శ్రీనాథ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ హాజరయ్యారు. ధర్నా కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 11 అంశాలతో వినతి పత్రం అందజేశారు.
1)అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు కట్టని వారిని వెంటనే రద్దు చేసి అర్హులైన వారికి ఇవ్వాలి.

2)రుణమాఫీ కానీ రైతులకు వెంటనే రుణమాఫీ వర్తింపచేయాలి

3)మండల కేంద్రంలో నిర్మించినటువంటి డబల్ బెడ్ రూములు పేదలకు పంచాలి.

4)మండల ప్రభుత్వ కార్యాలయలకు పక్క భవనాలు నిర్మించాలి.

5)మన మండలానికి చెందిన గురుకుల పాఠశాలను మన మండలానికి తీసుకురావాలి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి .

6)రోడ్డు పక్కన ఉన్న బావులకు లకు సైడ్ వాల్ నిర్మించాలి ప్రమాదాలు జరగకుండా చూడాలి.

7)గుండ్లపల్లి ,జంగపల్లి, గన్నేరువరం లో మత్తడిపై కల్వర్ట్ లు నిర్మించాలి.

8)ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.

9)మండల కేంద్రానికి కాలేజీ ఏర్పాటు చేయాలి.

10)బ్రిడ్జి ప్రజాభిప్రాయం మేరకు ఏర్పాటు చేయాలి.

11)డబుల్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభం చేయాలి.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చోక్కల్ల శ్రీశైలం, మండల సహాయ కార్యదర్శి కూన మల్లయ్య, పిప్పల్ల కనుకయ్య, జిల్లా నాయకులు కాంతాల అంజిరెడ్డి, బోయిని కనకయ్య , యువజన నాయకుడు మోలుగురి ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ మండల నాయకుడు ముల్కల పవన్, గ్రామ శాఖ కార్యదర్శులు బోయిని తిరుపతి ,బొమ్మకంటి ఆంజనేయులుచారి,లింగం గణేష్, చెరుకు ఆంజనేయులు, బోయిని మల్లయ్య,ఎండి నయుం,చిటవేణి రాము , లక్ష్మణ్, న్యాత కొమరయ్య, జాలి గోపయ్య ,బోయిని మల్లయ్య,కూన సంపత్, దామా సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News