Thursday, March 19, 2026

ప్రజా సమస్యల పట్ల మీరు చూపిన అపూర్వమైన స్పందనే ఈ కార్యక్రమానికి జీవం..ఈ మహా ఉద్యమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు – హృదయపూర్వక కృతజ్ఞతలు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 16 ~అన్నమయ్య జిల్లా :-: సోమవారం రోజున రాయచోటి పట్టణ వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన ప్రజా ఉద్యమ కార్యక్రమంలో, మహా ధర్నా కార్యక్రమంలోను, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీలోను వందలాది మందిగా స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమాన్ని ఘన విజయంగా నిలిపిన ప్రతి ఒక్క వైయస్ఆర్‌సీపీ కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి లు ఓ ప్రకటనను వెల్లడిస్తూ మీ అందరి ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, పార్టీ పట్ల మీకున్న అచంచలమైన విశ్వాసం, నాయకత్వంపై మీ అచంచల నిబద్ధత, ప్రజా సమస్యల పట్ల మీరు చూపిన అపూర్వమైన స్పందనే ఈ కార్యక్రమానికి ప్రాణం పోసిందని గర్వంగా తెలియజేస్తున్నామని తెలిపారు. మీ ఐక్యత, క్రమశిక్షణ, త్యాగభావమే ఈ మహా ఉద్యమ విజయానికి ప్రధాన బలంగా నిలిచాయన్నారు. ప్రజా సంక్షేమం, పేదల హక్కుల పరిరక్షణ కోసం మీరు చూపుతున్న ధైర్యసాహసాలు ప్రతి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తకు మార్గదర్శకంగా, ప్రేరణగా నిలుస్తున్నాయని ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయడమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని మరో సారి నిరూపించిన ఈ ఉద్యమం, భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు సాగేందుకు మనందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. మీరు చూపిన ఆదరాభిమానాలకు మీకు ఎంత చేసినా మీ రుణము తీర్చుకోలేమంటూ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పార్టీతో భుజం భుజం కలిపి, ప్రజల పక్షాన నిలబడి, అన్యాయ నిర్ణయాలపై గళమెత్తుతూ, న్యాయం సాధించే దిశగా నిరంతరం పోరాడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామని ఈ మహా ఉద్యమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ మరో సారి ప్రేమ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామనిగడికోట శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలు తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బి. కొత్తకోట మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్ అహ్మద్ అన్నమయ్య జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాయచోటి వేదికగా జరిగిన కార్యక్రమం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ప్రజల ఐక్యతతోనే ఇంత భారీ సక్సెస్ అందుకుందని ఖలీల్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు.~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News