వందేళ్లుగా పేద ప్రజలకు అండ సిపిఐ
ఎన్నికల హామీలను అమలు చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
కామ్రేడ్ బాల నరసింహ డిమాండ్
నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 4,
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ గత 100 సంవత్సరాలుగా పేదల పక్షాన అండగా నిలిచి అలుపెరగని రాజీలేని పోరాటాలు నిర్వహించిందని సిపిఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహ తెలిపారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో జరిగిన సీపీఐ జిల్లా కౌన్సిల్సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల నరసింహ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాస్తూ నియంత పాలన సాగిస్తున్నారని నిత్యవసర ధరలను పెంచి సామాన్య ప్రజలపై అధిక పన్నులు వేస్తూ భారం మోపుతున్నాడని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ సంస్థలకు దేశం సంపదను దోచిపెడుతున్నాడని ఆరోపించారు. అడవులలో ఉన్న ఖనిజ సంపదపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న గిరిజనులను ఆదివాసీలను వారికి అండగా ఉంటున్న భారతదేశ పౌరులైన మావోయిస్టులను మట్టు పెట్టేందుకు ఆపరేషన్ కంగారు పేరుతో బూటకపు ఎన్కౌంటర్లో చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు వెంటనే బిజెపి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ కంగారును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందని ద్రాక్ష లాగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకొని వెనుకబడిన నారాయణపేట జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాజకీయ అవినీతికి తావు లేకుండా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా పేద ప్రజలకు న్యాయం చేయాలని జిల్లాల్లో అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహ సంతోష్ వెంకటేష్ రాము నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

