Friday, March 20, 2026

*ప్రజా సేవకు బద్దులై పనిచేయాలి* *ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి* *ఎస్సీ ఎస్టీ సమస్యలకు తక్షణం పరిష్కార మార్గం చూపాలి**ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి**క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి* *జవాబుదారీగా తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి**నానబెట్టే ధోరణికి చరమగీతం పాడి.., పేదలకు అండగా నిలవాలి*..*ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించాలి**డి.వి.యం.సి సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు**ఎస్సీ ఎస్టీల పై వివక్షత చూడొద్దు**పైరవీలకు పోలీసులు లొంగొద్దు**జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేసిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి -నవంబర్ 29అధికారులు ప్రజా సేవకు బద్దులై పనిచేసినప్పుడే.. ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు వీలవుతుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు తెలియజేశారు.అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ సమస్యలకు తక్షణ పరిష్కార మార్గాన్ని చూపినవారవుతారని వారు చెప్పారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి, జవాబుదారీగా తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించాలని..,నానబెట్టే ధోరణికి చరమగీతం పాడి, పేదలకు అండగా నిలవాలని ఆదేశించారు.ఎస్సీ, ఎస్టీల సమస్యల పై మూడవ త్రైమాసిక జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని శనివారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు.ఈ డి.వి.యం.సి సమావేశానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి జిల్లా ప్రభుత్వ శాఖల అధికారులు హాజరైయ్యారు.తిరుపతి జిల్లా నిఘా , పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టిన అంశాల పై శాఖల వారీగా సమీక్షించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు..,జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యల పట్ల అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని,స్వయంగా తనిఖీ చేసి తక్షణమే పరిష్కారాన్ని చూపాలని సూచించారు.అదే సమయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని వారు ఆదేశించారు.ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ… ప్రధానంగా దీర్ఘకాలిక సమస్యకు తక్షణమే పరిష్కార మార్గాలను చూపడంతో పాటు,.. అధికారులు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించి, పేదలకు అండగా ఉండాలన్నారు. జిల్లా యంత్రాంగం అంకిత భావంతో పని చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టి సమీక్షించిన ప్రతి అంశానికి త్వరితగతిన పరిష్కార మార్గాలను చూపాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా ఎస్/ఎస్టీ లబ్ధిదారుల గృహాల మంజూరు పై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి సొంతింటి కలను సాకారం చేయాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి నీ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయా శాఖల సమాధానాలను పరిశీలించిన అనంతరం, జాప్యం జరిగిన అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులు త్వరితంగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు.డీవీఎంసీ లో ప్రస్తావించే ప్రతి అంశానికి అధికారులు పరిష్కారం చూపాల్సిన భాధ్యత ఉందని, సివిల్ రైట్స్ డే ప్రతి నెలా జరిపి ఎస్సీ/ఎస్టీ సమస్యలకు పరిష్కారం చూపాలను చెప్పారు.ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు సంబంధించి పట్టాలు మంజూరు, భూ సమస్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నిర్మాణం వంటి సమస్యలపై కమిటీ సభ్యులు విన్నవించుకోగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయింపు విషయంలో పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ల ప్రత్యేక గ్రీవెన్స్ త్వరలో కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గత సమావేశంలో కమిటీ సభ్యులు గుర్తింపు కార్డుల కోసం ఎన్నవించుకోగా ఈ సమావేశంలో వారికి గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు గృహాలు మంజూరు సంబంధించిన స్థలాన్ని గుర్తించడం, మంజూరు చేయడం వంటి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి గృహాలను మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి నీ ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యల పై పరిష్కార దిశగా కృషి చేయాలి అని తెలిపారు. ఎస్సీ ఎస్టీల అల్ట్రాసిటీ తదితర కేసులను జాప్యం లేకుండా సంబంధిత అధికారులు సీరియస్ గా తీసుకొని పరిష్కరించేలా చూడాలని తెలిపారు. జిల్లాలోని మండల స్థాయి, జిల్లా స్థాయిలో లాండ్ ఆర్డర్ పాటిస్తూ కేసుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని శాఖవారిని ఆదేశించారు. కమిటీ సభ్యులు అల్ట్రా సిటీ కేసులకు సంబంధించి ఎస్పి గారికి విన్నవించుకోక వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత బాధితులకు న్యాయం చేస్తానని తెలిపారు. సత్యవేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సత్యవేడు నియోజకవర్గం లోని పలు ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన సమస్యలపై వివరిస్తూ.. త్వరితగతన సమస్యల పరిష్కారానికి సంబంధిత డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ చెందిన భూములు, ఇళ్ల పట్టాలు వంటి సమస్యలపై వివరిస్తూ అందరికీ న్యాయం జరిగేలా పరిష్కారం చూపాలని తెలిపారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ కు సంబంధించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థల సేకరణ కు పనులను పూర్తి చేయాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద గృహాల మంజూరు విషయాలలో గృహ నిర్మాణ శాఖ వారు అర్హతను పట్టి మంజూరు చేయాలని తెలిపారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యుల దగ్గర నుంచి ఆర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, డీఎస్పీలు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓ లు రామ్మోహన్ , భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, డీవీఎంసి సభ్యులు, జిల్లా అధికారులు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News