నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా :-: జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పలువురు సబ్ – ఇన్ స్పెక్టర్లు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కలిసిన వారిలో రామసముద్రం ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ రవీంద్ర బాబు, వాయల్పాడు ఎస్ఐ తిప్పేస్వామి, మొలకలచెరువు ఎస్ఐ ప్రతాప్, మదనపల్లి తాలూకా ఎస్ఐ రామకృష్ణారెడ్డి మరియు సీసీఎస్ ఎస్ఐ నర్సింహుడు పుష్పగుచ్చమందించి దుశ్శాలువలు కప్పి ఆయా స్టేషన్ల పరిధిలో చేపట్టాల్సిన విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు. వారికి విధి నిర్వహణలో చేపట్టాల్సిన పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడి పట్ల సానుకూలంగా స్పందించాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. తమ పరిధిలోని గ్రామాలలో శాంతిభద్రతలను కాపాడుతూ, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆధునిక నేరాలను అరికట్టేందుకు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, కేసుల దర్యాప్తులో పారదర్శకత పాటించాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాలని ఎస్పీ ఉద్ఘాటించారు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా ప్రతి ఒక్క అధికారి నిబద్ధతతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు..~~~~~~~~~~~~~~~~~~

