Thursday, March 26, 2026

ప్రతి ఆదివారం భగవద్గీత ప్రవచన కార్యక్రమం-గురువులు హెచ్.కె. అంజనాద్రి దాస్

నేటిసాక్షి, మిర్యాలగూడ :పట్టణంలోని తొమ్మిదవ వార్డు ప్రకాష్ నగర్ ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి ఆదివారం భగవద్గీత ప్రవచన కార్యక్రమం గురువులు హెచ్ కె.అంజనాద్రి దాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని భక్తులు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవంతుడి యొక్క జీవిత సారాంశం, హిందూ సంప్రదాయం, జ్ఞానోదయం, భగవంతుడి పాఠ్యాంశం గురించి ఈ యొక్క భగవద్గీత ప్రవచనం యథాతథము తెలుపుతుందని గురువులు హెచ్.కె. అంజనాద్రి దాస్ అన్నారు. ఈ కార్యక్రమం మొదటి ఆదివారం ఆంజనేయ స్వామి దేవుడి సన్నిధిలో ప్రారంభం అయ్యిందని, వార్డు చిన్నారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ప్రవచన కార్యక్రమం విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు, స్వాములకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రతన్ సింగ్, చామర్తి అయ్యప్ప శర్మ, అంజిబాబు, చిలువేరు నర్సింహా, పందిరి వెంకన్న బ్రదర్స్, కడారి వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, పొనుగోటి నాగేశ్వర్, చిన్నారులు, భక్తులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News